Categories
హడావిడిగా ఇంటి పని ఆ తర్వాత ఆఫీస్ కి పోవడం అది అయ్యాక సాయంత్రం ఇంటికి రాగానే ఏ పార్టీకో పోవల్సి వస్తే ముఖమ నిస్తేజంగా నీరసంగా అనిపిస్తుంది.కాస్తా తాజాదనం తెచ్చేందుకు చిన్న చిట్కాలు అవలంభించాలి.ఓట్ మిల్,పెరుగు,బాదం పొడి,టామాటా గుజ్జు కలుపుకొని ముఖానికి కాసేపు మాసాజ్ చేసి చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుంటే కాంతివంతంగా ఉంటుంది. బియ్యం పిండి,కాస్త తేనె,టీ డికాషన్ కలిపి పై ముఖానికి పూతల వేసి పది నిమిషాల తర్వాత గోరు వెఛ్చని నీటితో కడిగేస్తే ముఖం మెరుస్తుంది.