మల్టీ స్టారర్ సినిమాలంటే నాకు ఎంతో గౌరవం కథ డిమాండ్ చేస్తే ఎంతో మంది ప్రతిభావంతులైన వాళ్ళు కలిసి నటిస్తే ఆ కిక్కే గొప్పగా ఉంటుంది అంటుంది శృతి హాసన్. హిందిలో మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుంది ఆమె. సినిమా పరిశ్రమలోకి కొత్తగా వస్తే ఇక్కడే అన్ని నేర్చుకోవటం వేరు కాని నేను సినిమాల్లోనే పుట్టి పెరిగాను అందుకే నాకు ఈ రంగం స్పష్టంగా అర్ధం అవుతుంది. సినిమల సక్సెస్ వెనక గొప్ప కథ కావాలి. అలాంటి సినిమాలో ఎంతో మంది గొప్పనటులు కలిసి నటిస్తే దశాబ్దాలు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే చక్కని పాత్రలు చేశామన్న సంతృప్తి మిగులుతుంది. నటులకు అద్భుతమైన పాత్రలు లభించడమే కదా అదృష్టం అంటుంది శృతిహాసన్.

Leave a comment