Categories
గుంతకల్ షుమారూ 4కిలోమీటర్ల దూరములో వున్న కసాపురం వద్ద నెట్టికల్ గ్రామంలో గల ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవాలి.ప్రతీ శనివారం ఈ ఆలయంకు భక్తులు తండోపతండాలుగా వచ్చి కటాక్షం పొందడం విశేషం కదా.16 వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయుల వారి పరిపాలనలో కుహూ గండం వుంది అని జ్యోతిష్య పండితులు చెప్పడంతో వారు తమ ఆస్థాన గురువైన వ్యాసరాయుల వారిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. తరువాత రాయలవారికి ఆంజనేయ స్వామి కలలో తనకు ఎండు పుల్లకి చిగురు పుట్టే చోట గుడి కట్టించిమన్నాడు.వెంటనే ఆచరణలో పెట్టి గుడి కట్టించి ఉగాది పండుగ ముందు 3 రోజుల నుండి సందడి ఆరంభం అవుతుంది.తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం.
నిత్య ప్రసాదం:కొబ్బరి, గారెలు,అప్పాలు.
-తోలేటి వెంకట శిరీష