Categories
సౌందర్య పోషణకు చాక్లెట్ ని వాడచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ . చాక్లెట్ ను కరిగించి దానికి తేన,సెనగపిండి కలిపి ముఖానికి పూతలా వేసుకొని ఆరిపోయాక వెళ్ళాను నీళ్ళతో తడిపి పూతను మృదువుగా నీళ్ళతో కడిగేసుకోవచ్చు. ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు ముఖాన్ని ఆరోగ్యంగా మెరుపు తో ఉంచుతాయి. ముఖంపై ముడతలుంటే,చాక్లెట్ ని కరిగించి అందులో గుడ్డులోని తెల్ల సొన,బాదం నూనె కలిపి గిలకొట్టి,మాస్క్ లా మొహానికి వేసుకుంటే చర్మం బిగుతుగా అవుతుంది వారంలో రెండు సార్లు ఈ మాస్క్ వేసుకుంటే చర్మం ముడతలు తగ్గుతాయి. అలాగే చాక్లెట్ పొడిలో గులాబీ నీరు కలిపి పేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం తాజాగా వుంటుంది.