వంటిల్లు చెమ్మగా ఉంటే క్రిమికీటకాలు చేరతాయి. తడితో దుర్వాసన వస్తుంది. వంట ఇంటి తలుపులు కిటికీలు వీలైనంత ఎక్కువ సేపు తెరిచి, గాలి, వెలుతురు లోపలికి వచ్చేలా చూడండి. చెద పురుగులు, బొద్దింకలు చేరకుండా ఉంటాయి. వంట చేసే గట్టు పైన జిడ్డు మురికి ఎప్పటికప్పుడు వదిలించాలి. సింక్ మూలల్లో తడిలేకుండా పేరుకోకుండా చూడాలి. వంటగది అరల్లో నిలకా జెల్ ప్యాకెట్లు కానీ, బొగ్గు ముక్కలను చిన్న మూటలా కట్టి ఉంచితే ఫ్రెష్ గా ఉంటుంది. సింక్ లో ఖాళీ పాత్రలు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వాసన లేకుండా చూసుకోవాలి. వంటింటి లోనే కుటుంబ ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.

Leave a comment