వరాలను ప్రసాదించే దేవుడే మన వర సిద్ధి హనుమంతుడు. హైదరాబాదులో మెహిదీపట్నం సమీపంలో ఉన్న విజయనగర కాలనీలో ఉన్న వర సిద్ధి హనుమాన్  దర్శనం చేసుకోవాల్సిందే మరి!! ఇక్కడ ఆలయం వెలుపల శివుడు, హనుమయ్య సమేత సీతారామ లక్ష్మణులు,నవ గ్రహాలు,గోశాల దర్శన మిస్తాయి.భక్తుల కోరికలు తీర్చే స్వరూపుడు ఈ దేవుడు.హనుమత్ జయంతి ఉత్సవాలు ఆర్భాటంగా,కన్నుల పండుగగా జరుగుతుంది. ప్రతి పర్వదినాలలో అన్నదానం చేసి స్వామి వారి సన్నిధిలో భక్తులు పాలు పంచుకోవడం విశేషం.సీతా రాముల కళ్యాణాన్ని హనుమయ్య దగ్గరుండి జరిపిస్తున్నట్టుగా దూర దూరాల నుంచి భక్తులు తరలి వస్తారు…
వర సిద్ధి హనుమంతుడుకి మనసులో తలచుకుని మూడు సార్లు ప్రదక్షిణం చేసిన అనుకున్న వరం ప్రసాదిస్తాడు.హనుమాన్ దేవాలయంలోని అర్చక స్వామి రామేశ్వర జోషి గారు,రామాలయం అర్చక స్వామి రాజ్ కుమారాచారి గారు భక్తులుకు తమ కోరికలు తీర్చే విధంగా ఎంతో భక్తి, శ్రద్ధతో పూజలు  చేస్తారు.శ్రీ వెంకట రెడ్డి గారు దేవాలయం లో భక్తుల సౌకర్యార్ధం అని వసతులు ఏర్పాటు చేసి భక్తుల ఆనందం కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ హనుమంతుని ఆశీస్సులు అందుకోవడం గమనార్హం. భక్తులు తమ కోరిక నెరవేరినదని ముడుపులు చెల్లించడమే మరి సాక్ష్యం సుమండీ!!

   ఇష్టమైన రంగు:సింధూరం
     ఇష్టమైన పూలు: నిత్య మల్లెలు.
    ఇష్టమైన పూజలు: తమలపాకుల పూజ
    నిత్య ప్రసాదం:     కొబ్బరి,అరటిపళ్ళు,జామ కాయలు.

        -తోలేటి వెంకట శిరీష

Leave a comment