చర్మం పొడిబారకుండా ఉండేందుకు వాడే మాయిశ్చరైజర్ల కంటే ప్రకృతి సహజంగా దొరికేవి వాడితేనే ఆకర్షణీయంగా ఉంటాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారానికి ఒకరోజు అలోవేరా గుజ్జులో తేనె కలిపి రాస్తే చర్మ సౌందర్యం మాత్రమే కాదు దురద, మంట వంటి సమస్యలు కూడా రావు. వేపాకు నూరి తలకు పట్టిస్తే పేలు, చుండ్రు వంటి సమస్యలు పోతాయి. అలాగే జుట్టు ఊడిపోతుంటే  వారానికి ఒకసారి కొబ్బరిపాలు అప్పటికప్పుడు తీసినవి తలకు పట్టించి ఓ గంట ఆగాక తలస్నానం చేస్తే చాలు ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి వస్తుంది.

Leave a comment