తెలుగులో సాహోతో ఆరంగ్రేట్రం చేయబోతుంది శ్రధ్దా కపూర్. వరుసగా సినిమాలు సక్సెస్ లతో ఆమె ఇప్పుడు సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది. ఇమె ఫిట్ నెస్ ఫ్రీక్ .నా వర్కవుట్స్ చాలా సీరియస్ గా తీసుకొంటాను. ఐదు రోజులు జిమ్,ఫిట్ గా ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు ఏరోబిక్స్,పిలేట్స్ చేస్తాను. యోగా పవర్ పట్ల నాకు నమ్మకం .నేను చేసే హార్డ్ వర్క్ నా షేప్ కు సహాకరిస్తే యోగా నాకు స్థైర్యాన్ని , బలాన్ని ఇస్తుంది.అసలు నా డైట్ లో నూనె పదార్థాలే లేవు. చక్కెర కనీస మాత్రంగా ఉంటుంది. పాలు ,జ్యూస్ సింపుల్ లంచ్.గోధుమ బ్రెడ్ ,పీనట్ బటర్ వంటి తేలికైన పదార్థాలతో డిన్నర్ ముగిసిపోతుంది. అయితే పండ్లు ,పండ్ల రసాలు తీసుకొంటూనే ఉంటా. ఇక పోతే నా తొలి బహుళ బాషా చిత్రం తమిళ,హిందీ, తెలుగుల్లో తీస్తున్నారు. తెలుగు ,హిందీ మాట్లాడటం అంతా ఎక్జైటింగ్ గా ఉంది అంటోంది శ్రద్ధా కపూర్.
Categories