చక్కని నవ్వు మొహానికి మరింత అందం ఇస్తుంది . నవ్వు సహజమైన ఆభరణం . శరీరంలో జరిగే అనేక రసాయనాల మార్పులతో నవ్వుకు విడదీయరాని బంధం ఉన్నది . శరీరంలో హార్మోన్ లు,ఎంజైమ్స్ విడుదల కావటానికి ఆరోగ్యపూరిత మైన నవ్వు ఎంతో దోహదం చేస్తుంది . ఈ ఎంజైములు హార్మోన్ లే శారీరక అవయవాల పనితీరుని మెరుగుపరుస్తాయి .హార్మోన్లలో వచ్చే అసమానతలు ఒత్తిడి ,ఆందోళనలకు కారణమై తద్వారా జీవనశైలి రుగ్మతలకు దారితీస్తాయి . అదే,హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటె హార్మోన్ల అసమతౌల్యాలు కనబడకుండా పోతాయి .

Leave a comment