Categories
తీర్ధ గంగా రాయల్ ప్యాలెస్ ఇండోనేషియా లోని బాలి ద్విపంలో ఉంది. మనదేశంలో ప్రవహించే పవిత్ర గంగానది స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టారు ఆ కోటను నిర్మించిన రాజు. ఆ నిర్మాణాన్ని జలసౌధం అని పిలుస్తారు. ఆ జలసౌధం లో పేరుకు తగిన్నట్లు ఎక్కడ చుసిన కొలనులు,జలపాతాలు ఫౌంటెయిన్ లు కనిపిస్తాయి. అందమైన శిల్పాలుంటాయి. అయితే ప్రతి శిల్పం నుంచి నీరు ధారగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడి నీళ్ళలో ఔషధ గుణాలున్నాయని ఇక్కడి ప్రజల నమ్మకం.