ఎండలోని వెళితే చాలు మాడి పోతుంది. ఎంత కళ్ళజోళ్ళు వాడినా ఏం చేసినా సెగలు పొగలకి చర్మం నల్లబడుతుంది. అందుకే సన్ స్క్రీన్ ని తప్పని సరిగా చర్మనికి రాసుకోవాలి. ఈ సీజన్ లో యాపిల్ సైడర్ వెనీగర్ ని వాడాలి. ఇది కమిలిన చర్మం వేడిని లగేస్తుంది. కళ్ళకు వేడి తగలకుండా గొడుగు పట్టుకు పోయినా నామోషీ ఫీల్ అవ్వోద్దు. వాటర్ బేస్డ్ స్కిన్ ప్రోడేక్ట్స్ మాత్రమే సమ్మర్ లో వాడాలి. S.P.F రక్షణ వున్న మాయిశ్చురైజలను వాడాలి. జిడ్డు చర్మం కనుక అయితే తేలిక పాటి మేకప్ వేసుకోవాలి. కీరా ముక్కలు, పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా వుంటుంది. చర్మం బావుండేందుకు ఇంట్లో నేచురల్ బ్లీచ్ తయారు చేసుకోవచ్చు. కొద్దిగా పెరుగు, సెనగపిండి, అందులో నిమ్మకాయ పిండి ఆ పేస్టుని మెడ, మొహం పైన రాసుకుని కొద్ది సేపు ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం శుభ్రంగా వుండటమే కాకా, దుమ్ము ధూళి మురికి లేకుండా చర్మం కాంతి వంతంగా వుంటుంది.

Leave a comment