అమెరికా నూతన అధ్యక్షుడు జొ బైడెన్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తుంది గారిమ వర్మ. ఆమె తల్లిదండ్రులు భారతీయలు. ఉపాధి కోసం అమెరికా వలస వెళ్లారు. గారిమ కెరీర్ గా డిజిటల్ మార్కెటింగ్ స్టాటజీలను ఎంచుకొన్నారు. అంతకు ముందు వాల్ డిస్నికి చెందిన ఎబిసి నెట్ వర్క్ లో హోస్ట్ గా పనిచేశారు. పారామెంట్ పిక్చర్స్ లో గ్రాఫిక్ డిజైన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహించారు. బైడెన్, కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో డిజిటల్ మరియా వ్యూహ కర్తగా ఉన్నారు. ఇప్పుడామె జిల్ బైడన్ బృందంలో డిజిటల్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు.