Categories
తమిళనాడు సి.ఎం స్టాలిన్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ ప్రియా చెన్నై మేయర్ పీఠం పై కూర్చున్న తొలి దళిత యువతిగా చరిత్ర సృష్టించారు. మొత్తం 48 మేయర్లు పనిచేసే అందులో ఇద్దరే మహిళా మేయర్లు 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్లు మేయర్ లుగా పనిచేశారు. ప్రియా 49వ మేయర్ ఆమె తండ్రి రాజన్ 30 ఏళ్లుగా డి.ఎం.కె లో పనిచేస్తున్నారు ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండటంతో 18 ఏళ్ల వయసులో కార్యకర్త అయింది ప్రియా. నిజానికి ఎన్నికల ముందే నా గెలుపు ఖాయం అయింది. నా ప్రాంత సమస్యల్లో వేటిని నేను తీర్చగలనో చెప్పాకే అందరు నా నాకే ఓటు వేస్తాం అని చెప్పేశారు అంటుంది ప్రియా.