చాలా మంది మహిళలు కుటుంబం కోసం కెరీర్ ను వదిలేసి తర్వాత పశ్చాత్తాప పడతారు అసలు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అనుకుంటాను ఉద్యోగ జీవితాలు స్త్రీ పురుషులు సమానమే. కెరీర్ ను ఇంటినీ సమన్వయం చేసుకోగలగాలి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే మనం నిర్ణయించుకో గలం, కొందరి జీవితాలు మార్చగలం అంటారు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈవో జరీన్ దారువాలా. పెద్ద హోదాల్లో  ఉన్న మహిళలు అవరోధాలను తేలిగ్గా చేధించగలరు. ఇతరులకు స్ఫూర్తి ఇవ్వగలరు ప్రాధాన్యతను అనుసరించి ప్రణాళిక వేసుకోవటం పనులు చేసుకోవటం. తోటి వ్యక్తులను నమ్మటం, మన ఆలోచనలు బృందంతో పంచుకోవటం మెరుగుదల కోసం చర్చలు ఇవే జీవితంలో ఎదిగేందుకు మార్గదర్శకాలు సూత్రాలు అంటారు జరీన్ దారువాలా.

Leave a comment