ఎన్నో పార్టీలకు వెళుతూ వుంటాం. ఎదో ఒక కొత్తదనం కనిపిస్తేనే వందమందిలో ఒకరుగా కనబడొచ్చు. ఇప్పుడు రీఫుల్స్ ట్రయ్ చేయండి స్పెషల్ గా కనిపిస్తారు అంటున్నారు డిజైనర్స్. చిన్ని చిన్ని కుచ్చిళ్ళతో దుస్తులకు ఒక అందం తేవడం రాఫుల్స్ అంటే పొడవాటి గౌన్ లు అనార్కలి డ్రెస్సులు, షర్టులు, చీరలు, కుర్తీలు, దుప్పట్టాలు, బ్లావుజులు వేటి పైకి ఈ రఫుల్స్ ఎంచుకున్న కొత్తదానమే. ఇవి రోజు వారీ వేసుకునే క్యాజువల్ వేర్ లో అయినా ప్రత్యేక    సందర్భాలకయినా నప్పుతాయి. ఆర్గంజా, నేత, బెనారస్ వంటి వస్త్రశ్రేణి కైనా ఈ ఫ్యాశాన్ చక్కగా వుంటుంది. ఈ రాఫుల్స్ లో సింగిల్ ఎడ్జ్, వాటర్ ఫాల్, సర్కులర్ ఇలా చాలా రకాలున్నాయి.

Leave a comment