బంగారు తీగ తో నేసిన వెండి తీగలతో అల్లిన నైలాన్ దాదాపు వస్త్రశ్రేణి అయినా అందరినీ ఆకట్టుకునేది చీరకట్టే ఎలాటి వాతావరణం లోనైనా అనువుగా వుండే చీరకట్టుకు ప్రాంతాల వారీగా ప్రత్యేక శైలి వుంది. ఉత్తర భారత దేశంలో స్త్రీలు పైట కొంగుని ముందుకు వేసుకున్నా దక్షిణ భారత దేశంలో పైట వెనక్కి జార విడిచినా, గోచీ పోసి కట్టినా, ఆయా ప్రాంతాలకు అవి ప్రత్యేకం. చీర కట్టులో ఇప్పటికి 80 వైవిధ్యాలు తెలాయి.దాదాపు 109 రకాలుగా చీర ఎంత వైవిధ్యంగా కట్టుకోవచ్చో అంతర్జాలంలో కనబడుతుంది నార చీర తో మొదలెట్టి, పట్టు చీర వరకు వచ్చినా చీర అందం ఎక్కువవ్వుతూనే వుంది. చీర అంచునే ఒక హుందాతనం.   ఒక ఆకర్షణ చీరకు మించిన అందమైన కాస్ట్యుమ్ ఇంకోటి లేదని ఫ్యాషన్ గురూలు ఏ నాడో చెప్పేశారు. ఇటు ఫ్యాషన్కే కాదు. భారతీయ సంస్కృతికి చీరే ప్రతి బింబం.

Leave a comment