ప్రకృతి వర్ణాలను ప్రేమించటం,కళకళలాడే పైరులను చూసి పరవశించి పోవటం చాలా మందికి ఇష్టం. కానీ ఈ ఆకుపచ్చ రంగు ఓ బామ్మా ఫేవరేట్. ఎంత పిచ్చి ఇష్టం అంటే ఆవిడ ఇల్లు వస్తువులు డ్రెస్,షూ,జుట్టు రంగు కూడా ఆకుపచ్చ లోనే ఉంటే చాలనే ఇష్టం. అమెరికా లోని న్యూయార్క్ కు చెందిన 74 సంవత్సరాల ఎలిజిబెత్ స్వీట్ హార్ట్ ఎప్పుడు డిఫరెంట్ గా ఉండాలని కోరుకొంటుంది. అందుకే తాను ఎంతో ప్రేమించే ఆకుపచ్చ రంగుని జీవితంలోకి ఆహ్వానించింది. ఇంట్లో అన్ని వస్తువులు గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. లైట్లు సోఫాలు కర్టెన్స్ ,కార్పెట్ మొత్తం ఆకుపచ్చ రంగే. ఆమెను అందరు గ్రీన్ లేడీ అంటారు. జీవితానికో ప్రత్యేకత కావాలి అని కోరుకుంటే ఇలా కూడా చేయవచ్చు.

Leave a comment