ఈ మధ్య సమంత ,పొడుగాటి పోల్ పైకి అవలీలగా ఎక్కి వంద కేజిల బరువు మోస్తూ కనిపించి అందరి ప్రశంసలు అందుకొంది . మహిళలు సున్నితంగా ఉండాలి కదా ఈ బరువులు ఎత్తే పనేమిటి అని అడిగితే చాలా గొప్ప సమాధానం చెప్పింది సమంత . అమ్మాయిలు బరువు ఎత్తితే అబ్బాయిల్లా కదలొస్తాయి .అందంపోతుంది అంటారు కానీ నాకయితే అంత బరువు ను మోస్తే చాలా ఆత్మవిశ్వాసం కలిగింది . పురుషుల పై ఆధారపడకుండా ఏ పని అయినా చేయగలిగే ధీమా వస్తుంది . అమ్మాయిలు ముందు ఇలాటి అపోహలు పోగొట్టు కోవాలనుకొంటా . మన సామర్థ్యం నిరూపించు కొనేందుకు ఇలాటి వ్యాయామాలు ఎన్నో చేయాలి . వ్యాయామం అందం కోసం కాదు ,ఆరోగ్యం కోసం నటిగా నేను అందానికీ ప్రాధాన్యం ఇస్తాను పార్లర్ కు వెళతాను మేకప్ చేయించు కొంటారు . కానీ అందంతోనే వ్యక్తిత్వం ఆధారపడి ఉండదు . అందంగా,బలంగా ,ఆరోగ్యంగా ఉండాలను కొంటాను అంటోంది సమంత

Leave a comment