కార్యాలయాల్లో ఉద్యోగాలు ఆరు నుంచి ఎనిమిది గంటలు కదలకుండా కూర్చొని పని చేయటం కంటే మద్యలో ఒక టీ బ్రేక్ తీసుకొంటే మనసు ,శరీరం బావుంటుందని ,మరింత ఉత్సాహంగా ,ఉల్లాసంగా పని చేస్తారని అధ్యయనాలు చెపుతున్నాయి . టీ బ్రేక్ అన్నది వృధా సమయం కాదని అది ఉద్యోగులను చాల చురుగ్గా పనిచేయిస్తుందని చెపుతున్నారు . ఆ అరగంట టీ బ్రేక్ అలసిన కండరాలకు కాస్త స్వాంతన లభించేలా చేస్తుందని, పైగా తాగే టీ లోని కెఫైన్,ధియోమిన్ లు మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయని చెపుతున్నారు . టీ తాగినా ,తాగకపోయినా పని గంటల మధ్య కొద్దిపాటి విరామం ఉంటేనే పనిచేసే ఉత్సాహం పెరుగుతుందని లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా పనిచేస్తుంటే క్వాలిటీ వర్క్ తగ్గుతుందని చెపుతున్నారు .

Leave a comment