తూర్పు గోదావరి జిల్లా సమీపంలోని బిక్కవోలు గ్రామంలో ఉన్న  శ్రీ గోలింగేశ్వర క్షేత్రానికి వెళుతున్న వనితలు!!  మీరు  వస్తారా? చోళ రాజుల కాలంలో ఈ ప్రదేశంలో నూటొక్క శివలింగాలకు పూజలు  జరుపబడేవి.తురుష్కుల అరాచకాలకు శివలింగాలను దాచేసారు.కాలక్రమేణా చీమలు నివాసం  ఏర్పాటు చేసుకున్నాయి.పుట్ట పెరిగిపోయింది.శివలింగాలు మరుగున బడ్డాయి.

ఒకనాడు  పశువుల కాపరి తన గోవులను మేతకి తీసుకుని వెళ్ళిన అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్య పోయాడు.గోవులు చీమలు పుట్టను తమ క్షీరంతో కరిగిస్తున్నాయి.ఈ వార్త తెలిసిన ఆ గ్రామ కరణం ఆ ప్రదేశం లో శివలింగాన్ని చూసి ఆనంద పడిపోయాడు.వెంటనే ఆలయం నిర్మించారు.గోవుల క్షీరంతో వెలిశాడు కావున  “గోలింగేశ్వరు”డిగా భక్తుల పూజలు అందుకుంటుంన్నాడు.

 

  ఇష్టమైన రంగులు: తెలుపు
  ఇష్టమైన పూలు: మారేడు దళాలు,
  ఇష్టమైన పూజలు: త్రికాలాభిషేకం,పంచామృతాభిషేకం
   నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,ఆవు పాలు

 

     -తోలేటి వెంకట శిరీష

Leave a comment