Categories
మేఘాలయలోని Mowlynnung గ్రామాన్ని ఆసియాలో కెల్లా పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందింది ఈ గ్రామాన్ని Gods own Garden గా పిలుస్తారు. కొన్ని దశాబ్దాల నుంచే ఈ గ్రామస్థులు ఇక్కడ స్వచ్ఛత మంత్రం పఠిస్తున్నారు గ్రామస్థులు ఎవ్వరు బహిరంగా మలమూత్ర విసర్జన చేయరు. బయట ప్రదేశాల్లో ఉమ్మివేయరు ప్లాస్టిక్ వాడారు. రహదారులు పరిశుభ్రంగా ఇరు వైపులా పూల మొక్కలతో చక్కగా ఉంటాయి. ఇళ్ళు కూడా ఎకో ఫ్రెండ్లీ ఇళ్లే నిర్మించుకొంటారు. ఇక్కడికి వచ్చే పర్యటకులు గ్రామ పరిశుబ్రత కోసం స్వచ్ఛరుసుం చెల్లించాలి. గ్రామంలో అందరూ తమ దినచర్యలో కొంత సమయం పరిసరాలు శుభ్రం చేయటం కోసం కేటాయిస్తారు.