రోజుకి కనీసం 250 గ్రాముల ఆకుకూరల్ని తీసుకోగలిగితే కండరాల పనితీరు బావుంటుందంటారు పరిశోధకులు ఎడిత్ కోవాన్  యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో నైట్రేట్స్ ఎక్కువగా ఉండే లెట్యూస్ కేల్ పాలకూర తోటకూర వంటి వాటిలో పాలు బీట్ రూట్ కూడా ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆకుకూరలు తీసుకునే వాళ్ళు కాళ్ళ లో బలం బాగా ఉన్నట్లు వాళ్ళు వేగంగా నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఆకు కూరలు తినే వాళ్ళలో వెన్నెముక కండరాలతో పాటు గుండె కండరాల పనితీరు కూడా మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. వృద్యాప్యంలో కూడా వీళ్లు చురుగ్గానే ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

Leave a comment