Acute coronary Syndrome:

Heart attack ని మెడికల్ పరిభాషలో myocardial infaction అంటారు. M.I. అని షార్ట్ గా. గుండె శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ చేయడానికి పంపు వలే పని చేస్తుంది అని అందరికీ తెలుసు కదా…అలాగే తన కండరానికి కూడా తానే రక్త సరఫరా చేసుకుంటుంది. దీనికోసమై గుండె నుంచి మొదలై గుండె కండరానికి సప్లై చేయటానికి మూడు రక్తనాళాలు ఉంటాయి‌. ఈ రక్త నాళాల్లో రక్తం అకస్మాత్తుగా ఆగిపోవటమే heart attack.

రక్తం ఆగిపోవటం వలన గుండె కండరానికి రక్తం అందక ఆ భాగం డామేజ్ అవుతుంది. దాని వలన గుండె పంపింగ్ పనితనం అకస్మాత్తుగా సగానికి పైగా తగ్గిపోతుంది‌. ఇలా రక్తం అకస్మాత్తుగా ఆగిపోవటానికి ప్రధాన కారణం రక్త నాళాల్లో వయసు పెరిగే కొద్దీ కొవ్వు పేరుకుపోవటం. బీపీ షుగరూ కొలెస్ట్రాల్ స్మోకింగ్ వంటి కారణాలవలన ఈ కొవ్వు పేరుకుపోయే ప్రక్రియ తొందరగా జరిగుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే ప్రక్రియ ప్రతీ మనిషిలో యుక్త వయసు లో ప్రారంభమై..అది పెరగటానికి నలభై యాభై సంవత్సరాలు పట్టవచ్చు. కానీ బీపీ షుగరూ కొలెస్ట్రాల్ స్మోకింగ్ వంటివి ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అందుకే యుక్త వయస్సులో మొదలై నలభై సంవత్సరాలకే పూడుకపోవచ్చు.

రక్తనాళం కొవ్వుతో పూడుకుపోతున్న సమయంలో రక్తనాళపు లోపలి పొర పగలటమూ..వెంటనే ఆ చోట రక్తం గడ్డకట్టి నాళం మూసుకపోవటము జరుగుతుంది. ఇదే heart attack. అంటే రక్తనాళాల లోపలి పొర ఆరోగ్యకరం గా పనిచేయకపోతే..అది పగులుతుంది‌. గడ్డకట్టిన ఈ రక్తపు ముద్దనే థ్రోంబస్ అంటారు. ఈ రక్తపు ముద్దను కరిగించటం డాక్టర్లు చేసే మొదటి పని. దీనినే థ్రోంబోలైసిస్ అంటారు. ఇది మొదటి దశ. ఇక రెండవ దశలో పూడుక పోతున్న రక్తనాళాలను వెడల్పు చేసి అక్కడ మళ్ళీ పూడుకోకుండా స్టెంట్ వేయటం జరుగుతుంది. ఒకవేళ వెడల్పు చేయలేనంతగా పూడుకుని పోతే అక్కడి రక్త నాళాల్ని బైపాస్ చేస్తారు, అచ్చం రోడ్డు రిపేరప్పుడు బైపాస్ చేసేట్టు గా.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే రక్తనాళాలు పూడుకపోవటానికి కొన్ని యేళ్ళు పడితే..అందులో రక్తం గడ్డకట్టి నాళం మూసుకుపోవటం అనేది అకస్మాత్తుగా జరుగుతుంది. ఇపుడున్న టెక్నాలజీ సహాయంతో రక్తనాళాలు కొవ్వుతో పూడుకుపోతున్న సమయంలోనే జబ్బు తీవ్రతను గుర్తించవచ్చు. అంటే క్షణాల్లో ముంచుకు వచ్చే heart attacks రాకుండా నివారించవచ్చు. Cardiac risk assessment ఈ దశలో జరగటం ఉత్తమం.

–-డాక్టర్.విరివింటి.విరించి(కార్డియాలజిస్ట్)

Leave a comment