Categories
జీడిపప్పు ని ఖనిజాల బ్యాంక్ అంటారు 100 గ్రాముల జీడిపప్పు 553 క్యాలరీలు ఉంటాయి.వీటిలో మెనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటి యాసిడ్స్ అధికంగా ఉండి చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించి రక్తంలో ఉండే మంచి కొలెస్ట్రాల్ స్థాయిల్ని పెంచుతాయి.జీడిపప్పులోని సోల్యుబుల్ ఫైబర్ ఉదర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఖనిజాలు ఫైటో కెమికల్స్ విటమిన్లు శరీరాన్ని అనేక రుగ్మతల నుంచి పరి రక్షిస్తాయి.శరీరంలో విభిన్న జీవక్రియలకు అవసరం అయ్యే పొటాషియం, మాంగనీస్, కాపర్, జింక్, మెగ్నిషియం వీటిలో లభిస్తాయి వారానికి రెండుసార్లు గుప్పెడు పచ్చిజీడిపప్పు తింటే విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల వచ్చే వ్యాధులు రావు.