బీట్ రూట్  టమాటో సూప్ తో రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . బీట్ రూట్ ఒకటి ఉడికించి తోలుతీసి ముద్దగా చేయాలి.బంగాళా దుంప ఒకటి ఉడికించి పై తోలు తీసేయాలి.టమాటో లు మూడు ఉడకబెట్టి ముక్కలు చేయాలి.ఆలీవ్ నూనె, తరిగిన ఉల్లిపాయ ముక్కలు,ఉప్పు,మిరియాలు సరిపోను.వేయించిన బ్రెడ్ ముక్కలు అలంకరణ కోసం తీసుకోవాలి.బంగాళదుంప టమోటోలు బీట్ రూట్ మిక్సీ లో వేసి గుజ్జుగా చేయాలి. బాండీ లో ఆలివ్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.తరువాత మెత్తగా చేసిన ప్యూరీ వెయ్యాలి.నీళ్లు ఉప్పు మిరియాలు వేసి ఉడకనిస్తే రుచిగా ఉండే విజిటేబుల్ సూప్ తయారు. వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి వేడివేడిగా తాగితే ఎంతో ఆరోగ్యం.

Leave a comment