Categories
షేక్ హ్యాండ్ కూడా మనకు ఆరోగ్యం గురించి చెబుతుందట. ఒక పరిశోధన ఏం చెబుతుందంటే చేతులు కలిసే సమయంలో పటుత్వం తగ్గితే భవిష్యత్ లో గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. కొన్ని వేల మంది పై ఈ అధ్యాయనం జరిగింది. షేక్ హ్యాండ్ లో పటుత్వం లేకపోతే గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, క్యాన్సర్ బారిన పడి అకాల మృత్యువుకు గురైనట్లు కనుగొన్నారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకోని మర్యాద పూర్వకంగా ఎదుటివారికి ఇచ్చే షేక్ హ్యాండ్ తో గట్టిగా చేతులు బిగించలేకపోతున్నారు. అని తేలితే వెంటనే డాక్టర్ చేత అన్ని రకాల పరీక్షలు చేయించుకోమంటున్నారు.