హాలీవుడ్ లో నటించమనే ఆఫర్లు ఎఫ్పుడు ఉన్నాయి కానీ అక్కడ బల్క్ డేట్స్ ఇవ్వాలి. రెండు మూడు నెలల పాటు కాల్షీట్లు మొత్తం ఇవ్వాలి.అవి ఒప్పుకుంటె ఇక్కడ చిత్రాలు చేయలేను. అందుకే ఆ సినిమాలకు దూరంగా ఉన్నా అంటుంది ఐశ్వర్య రాయ్.చాలా విషయాల్లో నేను అదృష్టవంతురాలిని మంచి పారితోషికం చక్కని సినిమాలు నన్ను చాలా త్వరగా ఫీల్డ్ లో నిలబెట్టాయి.మోడలింగ్ రోజుల నుంచి పారితోషికం విషయంలో నాకు ఎలాంటి సమస్య రాలేదు. నేను పెద్దగా జిమ్ కి వెళ్ళి కష్టపడింది లేదు.రిహార్సిల్స్ పెద్దగా చేయలేకపోయినా ర్యాంప్ పైన నా ప్రత్యేకమైన శైలీలో నడిచేదాన్ని మంచి కథలు విన్నప్పుడల్లా అందులో భాగం అయ్యేందుకు మనస్పూర్తిగా సిద్దం అయ్యేదాన్ని. ఇప్పుడు ఓ పాప మంచి కుటుంబం మంచి కెరీర్,భద్రమైన జీవితం నాది అంటుంది ఐశ్వర్యరాయ్.

Leave a comment