పెళ్ళికుదిరాక సాధారణంగా అమ్మాయిలు ఫేషియల్స్,మ్యాని క్యూర్ లు పెడి క్యూర్ ల పైన శ్రద్ధ పెట్టి వివాహ సమయానికి చక్కగా కళకళ లాడుతు కనిపించాలనుకొంటారు. డైటీషియన్లు ఓ రెండు నెలల పాటు ఆహారం విషయంలో శ్రద్ధ పెడితే అంతకంటే అందంగా కనిపించవచ్చు అంటున్నారు. సమతుల ఆహారం శారీరక వ్యాయామం అవసరం రోజుకు అరలీటర్ పాలు,రెండు కప్పుల కూరగాయలు మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. దానిమ్మ బొప్పాయి పుచ్చ,కర్బుజా వంటి పళ్ళు తినాలి. వాటిలోని యాంటీ ఆక్ససిడెంట్స్ వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. అన్నానికి బదులు రాగులు,జొన్నలు,కొర్రలు సబ్జాలు తీసుకొంటే బరువు నియంత్రణలో ఉంటుంది. మూడు లీటర్ల నీళ్ళు తాగాలి. కనీసం ముప్పావు గంట వ్యాయామం చేయాలి. ఏడు ఎనిమిది గంటలు నిద్ర పోతే మొహం మెరిసిపోతూ ఉంటుంది.

Leave a comment