అసోమ్ కు చెందిన రూప్ జ్యోతి సైకియా గోగోయ్ 2004లో విలేజ్ వీల్స్ పేరుతో స్థాపించిన సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి చేనేత ఉత్పత్తులకు, వాటికి శిక్షణ ఇచ్చేందుకు పనిచేస్తుంది. పనికిరాని ప్లాస్టిక్ ని సేకరించి సాంప్రదాయ పద్ధతి లో చేనేత గా మలుస్తున్నారు .హ్యాండ్ బ్యాగ్స్ డోర్ మాట్స్, టేబుల్ మాట్స్, టోపీలు ఇతర ఇంటి అలంకరణ వంటి ఎన్నో వెరైటీలు ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. తయారీ విధానాన్ని వేలమంది మహిళలు విలేజ్ వీల్స్ ద్వారా నేర్చుకున్నారు. 2012లో రూప్ జ్యోతి కాజారంగా హాత్ పేరుతో ఒక అవుట్ లెట్ తెరిచారు. అది ఆమె రూపొందించిన ఉత్పత్తుల ప్రదర్శన విక్రయ కేంద్రం.