Categories
ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటే మానసికంగా శారీరకంగా అంత శ్రమించవల్సిన అవసరం ఉండదు అంటుంది శిల్పాశెట్టి.వ్యాయామ పరికరాలు లేకుండా జిమ్ లోకి వెళ్ళవల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులువుగా వర్కవుట్స్ చేసుకునే వీలుగా సెలబ్రిటి ఫిట్ నెస్ యాప్ తీసుకొచ్చారు ఆమె.సరైన ఆహార ప్రణాళిక పాటిస్తూ బరువు తగ్గుతూ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా మార్చుకుంటే కండరాలను దృఢంగా చేసుకునే అనేక విషయాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అందరు పాజిటివ్ లైఫ్ స్టైల్ అలవర్చుకొండి అంటుంది శిల్పా శెట్టి.