మనం విసిరి పారేసే చెత్త భూమి లో పూర్తిగా కలిసి పోవాలంటే తరాలు గడవాలి అంటున్నారు అధ్యయనకారులు.పిల్లల డైపర్లు సానిటరీ నేప్కిన్లు నెలలో కలిసేందుకు 500 నుంచి 800  సంవత్సరాలు పడుతుంది.అల్యూమినియం కూల్ డ్రింక్ లు 200 సంవత్సరాలు ప్లాస్టిక్ బాటిల్ లు 500 ఏళ్ళు టెట్రా పాలు,కూల్ డ్రింక్ ల ప్యాకెట్లు ఐదేళ్లు,అరటి తొక్కలు పదిరోజులు ఇక అల్యూమినియం ఫాయిల్స్ అయితే ఎప్పటికీ మట్టిలో కలవనే కలవవు. మన దేశంలో దాదాపు 38 కోట్ల జనాభా నుంచి సంవత్సరానికి పోగయ్యే చెత్త ఆరు కోట్ల టన్నులని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెబుతోంది.ఇది ఐదేళ్ల క్రిందట నివేదిక.అందుకే చెత్తని విడదీసి వ్యర్ధాలను సాధ్యమైనన్ని తగలబెట్టి కొన్నింటిని రీసైకిల్ చేసే ఏర్పాటు చేస్తేనే గానీ భూమి కాలుష్యం లేకుండా ఉండదు.చెత్త విషయంలో కాస్త ఆలోచించండి అంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment