గుమ్మడి గింజలను ఇప్పుడు సూపర్ ఫుడ్ అంటున్నారు వందగ్రాముల గుమ్మడి గింజల్లో శరీరానికి కావలసిన సగం పైగా ప్రోటీన్ ఉంటుంది.చీజ్, బటర్, చాక్లెట్ బార్స్,బటర్ రోస్ట్ ఇలా ఎన్నో తయారుచేస్తున్నారు గుమ్మడి గింజల రోస్ట్  చాలా సులభం.తొక్క తీయని గింజలను కాస్త వెన్న ఉప్పు అల్లం పొడి కలిపి వేయించుకుంటే దాన్నే రోస్ట్ అంటారు.వేరుశెనగ బెల్లం కలిపి చేసే చిక్కి మాదిరే గుమ్మడి గింజలతో కలిపి చేయచ్చు.వీటినే బ్రిట్టెల్స్ అంటారు గుమ్మడి గింజల తో నూనె కూడా చేస్తారు నిద్ర రాకపోతే గుప్పెడు గుమ్మడి గింజలు తింటే చాలు మంచి నిద్ర వస్తుంది.

Leave a comment