స్పా ట్రీట్ మెంట్ చాలా  ఖరీదుగానే ఉంటాయి. ఎక్సోటిక్ ప్రోమో గ్రేనేడ్ ట్రీట్ మెంట్ తో దానిమ్మ రసం ,నిమ్మ రసం ,అల్లం , బ్రౌన్ షుగర్  తో సంప్రదాయ నూనెలతో మస్సాజ్ ఉంటుంది. అలాగే ప్రోమో గ్రేనేడ్ షుగర్ స్క్రబ్ అంటే దానిమ్మ గింజలు పంచదార తో చర్మం పైన మృతకణాలు తొలగించటం మురడ్ ప్రోమో గ్రేనేడ్  అంతే దానిమ్మ గింజలు మురాడ్ క్రీమ్ తో చేసే స్పా. ఇక మల్టీ విటమిన్ పేస్ ప్యాక్ అంటే పాల నుంచి తీసిన లాక్టిక్ యాసిడ్ ,దానిమ్మ రసం కలిపి పేస్ ప్యాక్ వేస్తారు. ఇక దానిమ్మతో పాలిష్ అంటే దానిమ్మ బొప్పాయి నూనెలు కలిపి చేసే మస్సాజ్. ఇన్నింటిలోను ఉన్నది మన రోజూ బోర్ కొడుతుందని గింజలు వేయరు వలుస్తారులే అని బద్దకించి దానిమ్మ పండు. ఇంత అందాన్నిచ్ఛే పండు రోజు కడుపులోకి పోతే ఇంకెంత అందం ఆలోచించండి. ఇంత చిన్న దానిమ్మ గింజల్లో ఎంత శక్తి వుందో.

Leave a comment