సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు అనేకం శృతి హాసన్ అనుభవం కూడా ఇదే. కర్ణాటక కు చెందిన ఒక డాక్టర్ అదేపనిగా ట్విట్టర్ లో శృతి ఎంతో ఘోరమైన మాటలతో అవమానించటం తో ఆమె ఎంతో ఆవేదన పడిందట. కానీ డాక్టర్ కాస్త నిన్ను చంపేస్తాన్నంత దూరం వచ్చాక ఇక ఆమెకు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. చెన్నయ్ సైబర్ క్రైమ్ కు శృతి తరఫున వ్యక్తులు వచ్చి ఆ డాక్టర్ వేధిస్తున్న ఆధారాలు చూపెట్టి అతని మెయిల్ ఐడి ఫోన్  నంబర్ పోలీసులకు ఇచ్చారట. శృతి హాసన్ ఇచ్చిన పిర్యాదు తో పోలీసులు డాక్టరు గురించి విచారించే పనిలో వున్నారు. ఎవరి పనివాళ్లని చేసుకోనిస్తే ప్రాబ్లమే ఉండదు.

Leave a comment