టమాటో అండ్ కో కేరాఫ్ కృత్తికా పర్వాల్. ఈ కేరాఫ్ అనిపించుకోవటం వెనకొకరుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పుట్టి పెరిగిన కృతిక అమెరికా లో ఎంబీఏ చేస్తూ సెమిస్టర్ లో భాగంగా కాగితంలో కాయగూరల విత్తనాలు ఇమిచ్చి ఆ పేపర్ వాడేశాక దాన్ని నేలలో నాటితే అందులోంచి విత్తనాలు మొలకెత్తించేలా చేస్తే ఆడో మంచి వ్యాపారం అవుతుంది కాయితం వేస్ట్ కాకుండా వుంటుందీ అనుకొందిట. ఈ ఐడియా కి ప్రొఫసర్స్ అభినందనలు తెలిపారు. ఇండియాకి తిరిగివచ్చి ఈ పేపర్ విత్తనాల ఐడియా ను మార్కెట్ చేస్తే కిసాన్ సంస్థ వాళ్ళు తోలి ఆర్డర్ ఇచ్చారు. కెచప్ లో వాడే టమాటో విత్తనాలతో పేపర్ తయారు చేసి ప్రచారం కోసం పంచితతే బ్రహ్మాండమైన స్పందన ప్లస్ పబ్లిసిటీ వచ్చాయి. ఇదిగో ఇలా మొదలైంది టమాటో అండ్ కో. ఇప్పుడిదో పెద్ద బిజినెస్. ఎన్నో సంస్థల ఆర్దార్లున్నాయి కృతిక పర్వాల్ కు.

Leave a comment