Categories
కోవిడ్ సమయం ఇది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి విరాళాలు ఇస్తానంటే వ్యక్తిగతంగా పాటల్ని అంకితం చేస్తా, మీ స్నేహితులకు బంధుమిత్రులకు పుట్టినరోజు విషెస్ చెబుతానని చెప్పాను. కొన్ని నెలలుగా ఇప్పటికీ మూడు వేల పాటలు వీడియోలు చేశాను. 85 లక్షల విరాళాలు అవసరం ఉన్నవారికి నేరుగా వారి ఖాతాలోకి వెళ్లే లాగా చేశాను. ఒక ఎన్నారై లక్షన్నర రూపాయలు విరాళం ఇచ్చాను అంటూ చెప్పింది గాయని చిన్మయి.మనుషుల్లో మానవత్వం మిగిలి ఉందని చెప్పేందుకు ఇంతకంటే ఇంకే ఉదాహరణ ఏముండాలి అంటోంది చిన్మయి.కోవిడ్ వేళ తన పాటలతో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది చిన్మయి.