ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన సజిత తన ఇంటి పది ఇళ్ల అవతల తన ప్రేమికుడి ఇంట్లో గత పదేళ్లుగా దాక్కుంది. కేరళ లో జరిగిన ఈ సంఘటన ఈ మధ్య బయటపడింది. ఫిబ్రవరి 2, 2010న పాలక్కాడ్‌ జిల్లాలోని అలియూర్‌ అనే పల్లెలో వేలాయుధన్‌ అనే వ్యక్తి 18 ఏళ్ల తన కుమార్తె సజిత కనపడటం లేదని పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చాడు.రోజుల తరబడి, ఎంక్వయిరీ చేసిన సజిత దొరకలేదు సజిత ఏమయింది. పదేళ్లుగా ఆమెను చుసిన వాళ్ళులేరు. సజిత ఇంటి దగ్గర లో ఉన్న రహమాన్‌ ను మూడు నెలల క్రితం ఇంట్లో వాళ్ళతో గొడవపడి కనపడకుండా పోయాడు ఒక వారం తర్వాత రహమాన్ అన్న దగ్గర లో ఉన్న ‘నెమర’ అనే ఊర్లో తమ్ముడిని చూశాడు. పోలీసులకు చెప్తే వాళ్లు అతణ్ణి పట్టుకున్నారు. అతనితో పాటు సజిత అతనుండే అద్దె ఇంట్లో కనిపించింది. మరి పదేళ్లుగా ఏమయిందీ అంటే అసలు కథ బయట పడింది. సజిత రహమాన్‌ ను ప్రేమించింది. రజిత ఇంట్లోంచి పారిపోయి రెహమాన్ ఇంటికి వచ్చింది రెహమాన్ తన ఇంట్లో తను ఉండే చిన్న గదిలో సజిత ను దాచి ఉంచాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా అతని గది కిటికీ ఊచలు తీసి ఆమె టాయిలెట్ అవసరాలకు రాత్రిపూట వెళ్లి వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. తన గదికి తాళం వేసుకొని తాళం కప్పు కు ఎలక్ట్రిక్ వైర్ కనెక్ట్ చేశాడు .ఎవరు ముట్టుకున్నా చిన్నగా షాక్ కొట్టేది. అతని తల్లిదండ్రులు ఇద్దరూ రోజు కూలీ కి వెళ్లే వాళ్ళు చెల్లెలు ఇంట్లోనే ఉండేది. సజిత ను ఇంట్లో దాచాక రెహమాన్ ఇంట్లో వాళ్ళతో దురుసుగా ఉండేవాడు. అందుచేత ఎవరూ అతని గది జోలికి వెళ్లే వాళ్ళు కాదు .ఆ గదిలో ఒక టివి మాత్రమే ఉంది .రెహమాన్ ఎలక్ట్రీషియన్, పెయింటర్ పని పూర్తి కాగానే వెంటనే ఇంటికి వచ్చేవాడు .ఆ చిన్న గదిలో ఆమెను పదేళ్లపాటు రహస్యంగా ఎలా దాచాడో ఆశ్చర్యమే .కానీ ఆర్థికంగా ఆమెను పోషించే స్థోమతా లేక ,వేరే కాపురం పెట్టే ధైర్యం చేయలేక ఆమె ఇంట్లోనే దాచి ఉంచాడు .సజిత తీసుకున్న నిర్ణయం మాత్రం ఎవరూ ఊహించలేనిది. ఒక వ్యక్తి సంవత్సరాల తరబడి ఆ గదిలో అలా ఉండి పోయిందంటే ఆ శక్తి ఆమెకు ఆమె ప్రేమ ఇచ్చి ఉండాలి. వారిద్దరూ ఉన్న చిన్న గది చూసి పోలీసులే ఆశ్చర్య పోయారు చివరికి ఇదంతా చూశాక ఎవరికీ వాళ్ళ ప్రేమనూ కాదనే శక్తి లేకపోయింది. సజిత రెహమాన్ లు ఇప్పుడు పెళ్లాడబోతున్నారు ప్రేమను కులమతాలు,ఆర్ధిక కారణాలు ఆటంకం అయినప్పుడు ప్రేమికులు వారికి తోచిన దారులు వాళ్ళు వెతుకుతోనే ఉంటారు.కానీ సజిత కధ మాత్రం ఎవ్వరు ఊహించలేనిది. ప్రేమకున్నా గొప్ప శక్తి కి నిదర్శనం కూడా.

Leave a comment