లాక్ డౌన్ లో బ్యూటీ పార్లర్ లకు వెళ్ళే అవకాశం లేదు. ఐబ్రోస్,ఫెషియల్ వాక్స్ పెడిక్యూర్ వంటివి ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. వాక్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పంచదార,తేనె నిమ్మరసం కలిపి వేడిచేయాలి . మిశ్రమం చక్కగా అయ్యాక దానిని కాళ్ళు చేతులకు వాక్స్ గా ఉపయోగించవచ్చు. ఇంట్లో ఫెషియల్ గా పాలు,తెనె కలిపి ముఖానికి ఫేస్ పాక్ లాగా వేసుకోవచ్చు. ఓట్స్,తెనె ,ఆలివ్ మిశ్రమం మొహంపై నెమ్మదిగా మర్దన చేసి చల్లని నీళ్ళతో కడిగేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. సెనగపిండి,పాలు,పసుపు,తెనె కలిపి పేస్ట్ లా చేసి కాళ్ళకు ప్యాక్ లాగా వేయాలి. పది నిముషాల తర్వాత నీటిలో కడిగేయాలి. ఈ ప్యాక్ చేతులకు కూడా వేసుకోవచ్చు.

ReplyForward

Leave a comment