మనిషి సహజ లక్ష్యం నడక నడిచేది కాళ్లతోనే అయినా శరీరంలో అన్నిభాగాలకు మేలు కలుగుతోంది. రక్త ప్రవాహం మెరుగై శరీరంలో ఆక్సిజన్ సరఫరా అన్నీ పెంచుతోంది. కానీ ప్రతి చిన్నదానికీ వాహనం ఉపయోగిస్తే నడక మేలును గుర్తించటం లేదు మనిషి నడక వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి క్లాట్స్ ఏర్పడవు గుండెపోటు రానివ్వదు రక్తపోటును తగ్గిస్తుంది. తుంటి భాగం బలపడి ఎముకలు పెలుసు బారకుండా ఉంటాయి. మోకాలి ప్రాంతంలో ఉండే ద్రవపదార్థాలు మెరుగ్గా ఉండి కందెనలా పనిచేస్తాయి. చేతులు ఊపుతూ నడుస్తారు కనుక చేతి కండరాలు బలాన్ని సంతరించుకుంటాయి. మెదడు చురుకుదనాన్ని సంతరించుకుంటుంది.నడక తర్వాత మూడ్ పాజిటివ్ గా తయారవుతుంది. నలుగురితో కలిసి నడిస్తే స్నేహాలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత వస్తుంది. ప్రాచీన మానవుడు రెండు కాళ్లపైన నడవగలిగిన స్థితిని అందుకోన్నందువల్లనే ఇతర జీవుల పైన ఆధిపత్యం సాధించాడు. తప్పకుండా నడవండి. ఆరోగ్యం కోసమే నడక.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134