Categories
పెళ్ళయితే బోలెడన్ని సమస్యలు , ఎన్నో బాధలు , ఎంతో ఓర్పు కావాలి అనుకుంటారు సహజంగా. కానీ పెళ్ళి చేసుకుంటే నే ఆరోగ్యంగా వుంటారు అంటున్నాయి అధ్యాయినాలు . పెళ్ళి కానీ వారి తో పోల్చుకుంటే పెళ్ళి అయిన వారిలో గుండె ఆరోగ్యంగా ఉందని వారు స్పష్టం చెస్తున్నారు. సుమారు ఏడు వేళ మంది మీద వీరు సుధీర్ఘమైన అధ్యయినం చేసారు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నవారు పెళ్ళి కాని వారు త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువని ఈ అద్యాయినం స్పష్టం చేసింది. ఒంటరిగా వుండే కారణం వల్లను , సంతోష విషాదాలు పంచుకునే తోడు లేకపోవడం తో గుండె బలహీనం గా తయారవ్వుతుందన్నారు. వైవాహిక జీవితం లో ఆనందం వ్యక్తులకు ఎక్కువకాలం జీవించే శక్తి ఇస్తుందని పరిశోధకులు చెప్పుతున్నారు.