Categories
చూసేందుకు కాస్త కొత్తగా, సందర్భానికీ, ఆహారానికీ నొప్పేలా కొత్త డిజైన్ ఫ్యాషన్ బ్యాగ్ బాక్స్ లు మార్కెట్ లోకి వచ్చాయి. చతురస్త్ర, దీర్ఘ చతురస్త్ర ఆకారాల్లో రూపొందించిన ఈ హ్యాండ్ బ్యాగులు అచ్చం డబ్బాల్లాగే ఉన్న, ట్రెండీ లుక్ లో చూసేందుకు బాగున్నాయి. ఈవినింగ్ పార్టీలకు గెట్ టు గెదర్ లకు ఈ బ్యాగ్ బాక్స్ లు బాగుంటాయి. ఇవి మణికట్టుకు తగిలించుకునే బాక్సులు చక్కని ప్రింట్లు పూసలు, పూల వంటి హంగులు చేర్చిన డిజైన్లలో ఈ బ్యాగ్ లు ఎవరినైనా ఆకట్టుకొంటాయి. వీటిలో ఎక్కువ వస్తువులు పెట్టుకునే వీలు కూడా ఉంటుంది.