కుక్కర్ లో కంటే వండి వార్చిన అన్నం పొడి పొడిగా బావుంటుంది. కానీ అన్నం వార్చడం అంటే చాలామందికి చేతుల పైన గంజి పడిపోతుందని భయం అలాగే జల్లెడ అడ్డంపెట్టి లేదా ప్లేట్ పెట్టి గుడ్డతో గట్టిగా పట్టుకుని గంజి వార్చడం అంటే కష్టం కూడా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అన్నం కింద పడిపోతుంది లేదా గంజి చేతులు పైకి వస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా వచ్చింది రైస్ డ్రైనర్ పొడవాటి కడ్డీ లా కనిపిస్తుంది ఈ పరికరాన్ని అన్నం ఉడికే పాత్రకు ఫిక్స్ చేసి దాన్ని ఇంకో గిన్నె పైకి ఒక పక్కగా పెట్టేస్తే సరి ఒక్క చుక్క కూడా గంజి మిగలకుండా చేస్తుంది. అలాగే గంజి లోకి అన్నం కూడా జారిపోదు రైస్ డ్రైనర్ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వచ్చు.

Leave a comment