మైక్రోవేవ్ విషయంలో ఇప్పటికీ చాలా మందికి చాలా సందేహాలుంటాయి. ఇందులో వండటం వల్ల కూరగాయల్లో ఎక్కువ పోషకాలు పోతాయని అనేక మంది ఉద్దేశ్యం. అసలు ఏ పద్ధతి ఉపయోగించి వండినా ఎన్నో కొన్ని పోషకాలు పోవటం సహజం.వండటం వల్ల కూరగాయల్లో కొంత పీచు తగ్గిపోతుంది.మైక్రో వేవ్ లో పోషకాలు ఎక్కువగా ఉండాలంటే కాస్త నీరు తక్కువగా వాడాలి. అతిగా దేన్నీ ఊడికించరాదు. కూరగాయలపై మూతలు పెట్టి వండాలి. ఇరుకు కాకుండా పెద్దబౌల్ లో ,ముక్కలు పెద్దవిగా ఉండేలా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే పోషకాలు పోకుండా ఉంటాయి. మైక్రోవేవ్ లో వంట వల్ల మరీ నష్టం ఏదీ లేదంటారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment