అలస్కా నుంచి బయలుదేరి సాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో సహాయకురాలు షీలా ఫ్రెడె  రిక్ ఒక మామూలు దుస్తులతో ఓ పెద్ద మనకిషి వెనక సీట్లో కూర్చున్న అమ్మాయిని చూసింది. ఆ సూటూ  బూటు  వేసుకున్న మనిషి ఈ పిల్లతో ఎదో మాట్లాడుతున్నాడు. ఆ చిన్న పిల్ల భయంభయంగా చుట్టూ చూస్తోంది. పక్కన కూర్చున్న వ్యక్తితో ఎదో మాట్లాడాలని చూస్తోంది. షీలా కు ఇది చుస్తే ఎదో అనుమానం వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి కళ్ళతో మూత్ర శాల వద్దకు రమ్మని సైగ చేసి అక్కడో పెన్ను పేపరు   పెట్టింది.దాంతో బాలిక ఐ నీడ్  హెల్ప్ అని రాసి బయటకు వచ్చేసింది. షీలా ఆ పాపకు ఎదో అపకారం  జరగబోతుందని ఊహించి పైలెట్ కు చెప్పింది . పైలెట్ నావిగేషన్ ద్వారా పోలీసులకు సమాచారం పంపాడు. విమానము శాన్  ఫ్రాన్సిస్కో లో ఆగేసరికి  పోలీసులు వచ్చి ఆ నిందితుడ్ని అరెస్ట్ చేసారు. ఆ బాలిక షీలా ను కౌగలించుకుని తనను  తల్లితండ్రుల నుంచి తప్పించి అక్రమ రవాణా చేస్తున్నాడని చెప్పింది. షీలా అలర్ట్ అయ్యి ప్రమాదం ఊహించి పాపను కాపాడినందుకు అందరు అభినందించారు ఒక అమాయకురాలి జీవితం  కాపాడింది షీలా

Leave a comment