అమ్మ జయలలిత నివాసం పోయెస్ గార్డెన్స్ వీధుల్లో ఒకచక్కని పాట  గిరికీలు కొట్టింది. ఫైర్ బ్రాండ్ ర్యాప్ సింగర్ సోఫియా అష్రఫ్  తమిళ రాజకీయాల పై భగ్గుమంది. శాసన సభ పక్ష నేతగా శశికళ ను ఎన్నుకున్న నేపథ్యంలో చెన్నయ్  కు చెందిన సోఫియా అష్రఫ్  తన పాటతో నిరసన వ్యక్తం చేసింది . ప్రజలచే ఎన్నిక కానివారు మంత్రులుగా ఉండేందుకు అనర్హులు. అనే మాటే పాటగా సోషల్ మీడియాలో కూడా విహారం చేసింది. శశికళ ఎంపిక ధర్మసమ్మతం కాదని ఆమె తన ఆక్షేపణ వ్యక్తం చేసింది. తన ప్రదర్శన కు ఆపేందుకు ఓ పోలీస్ ప్రయత్నం చేసాడని తన వస్త్ర ధారణ ను కూడా ఆక్షేపించాడని సోఫియా ఫేస్ బుక్ పోస్ట్ చేసింది. ఈ పాటకు ఈ అమ్మాయి కోపానికీ  నిరసనకీ నెటిజన్లు బ్రహ్మాండంగా స్పందించారు.

Leave a comment