Categories
ప్రతి పదార్ధం తయారీ లోను సుగంధ ద్రవ్యాలు కలిపే అలవాటును, వాటిలో వుండే హీలింగ్ పవర్ ను తెలుసుకునే చేసారు మన పూర్వికులు. సగం అనారోగ్యాలు ఇలా చేయడం వల్లనే పోయాయి. ధైమ్, రోజ్ మేరీ రెండు హెర్బ్స్ లో ఇంచుమించుగా ఒక్కటే లక్షణాలుంటాయి. ఈవి స్టిములెంట్స్ గా తేలికపాటి కీ కంజెస్టెంట్స్ గా పని చేస్తాయి. రోగ నిరోధక శక్తి ఏకాగ్రత పెరిగేందుకు సహకరిస్తాయి. పుదీనాలాగా వుండే రోజ్ మేరీ రక్త పోటును తగ్గిస్తుంది. ధైమ్ వేసి కాచిన నీటి తో స్నానం చేస్తే రుమాటిక్ నొప్పుల నుంచి ఉపసమనం కలుగుతుంది. మాత్రలు, సప్లిమెంట్స్ స్దానంలో ఈ సహజమైన హెర్బ్స్ డాక్టర్ సలహా పైన మోతాదు లో తీసుకుంటే చాలా అనారోగ్యాలు ఈజీగా తగ్గిపోతాయి.