ప్రతి ఉదయం కపు కాఫీ తోనే తెల్లారుతోంది కోట్లాది మందికి. ఇంత మంది మనసు దోచుకున్న కాఫీ పొడిలో సంపూర్ణ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాఫీ పొడి పంచదార,నూనె కలిపి స్నానానికి ముందు సున్ని పిండిలా ఉపయోగిస్తే మృతకణాలు పోతాయి అంటున్నారు. చాక్లెట్ పొడి,తేనె,కొబ్బరి నూనె ,కాఫీ పొడి పాలు కలిపి మొహానికి ప్యాక్ లా వేసుకొని అరగంట ఆగి కడిగేస్తే ముఖం కాంతిగా అయిపోతుంది. కాఫీ పొడి ఆలివ్ నూనె, నిమ్మరసం మొహంపైన రాసి కాసేపు ఆగి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. కాఫీ పొడి పాలు కలిపి కాళ్ళ చుట్టు రాసి కాసేపు ఆలా వదిలేసి కడిగేస్తే కాళ్ళ చుట్టు నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి.

Leave a comment