కైరా మన దేశపు వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్.ఊహ జనిత పాత్రా. ఈ సంవత్సరం జనవరి 28 వ తేదీన ఇన్‌స్టాగ్రామ్ లో అడుగుపెట్టింది కైరా. ఈమెను అనుసరించే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఈమె పేరుతో వీడియోలు, ఫోటోలు పెట్టేందుకు ప్రత్యేక బృందం ఉంది. హిమాన్షు గోయల్ రూపొందించిన కైరా పూర్తిగా ప్రకటనల కోసం సృష్టించారు. ఈమెతో అడ్వటైజ్మెంట్ తీసేందుకు దూర ప్రాంతాలకు వెళ్లే ఖర్చులు ఉండవు. ఏ ప్రాంతంలో అయినా త్రీడీ సాయంతో ఈమెను జత చేస్తారు. ఇప్పటికే ఇన్ స్టా లో ఈ కైరా అందరితో వీడియోల్లో చాటింగ్స్ లో గలగలా మాట్లాడేస్తుంది.

Leave a comment