మడ్ బాత్ చికిత్స ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్నదే. కాలిఫోర్నియాలోని రిసార్ట్స్ లో ,అగ్ని పర్వతాల నుంచి వచ్చే బూడిదను వేడి నీటి ఊటల నుంచి తీసిన శుభ్రమైన నీళ్ళతో చేసే బురద వైద్యం చాలా ప్రసిద్ధి కూడా. నిజానికి ఈ బురద వైద్యం మన ప్రాచీన వైద్య గ్రంథాల్లో ఉన్నదే. ఇప్పుడు ఈ వైద్య చికిత్స నడుస్తోంది. బురద మట్టిని ఎండనిచ్చి జల్లెడ పట్టి ఆ లవణాలు కరిగిన మట్టిని పల్చగా వంటికి పట్టిస్తారు. దీని వల్ల చర్మం లోని రక్తనాళాలలో ప్రవహం పెరిగి చర్మ, రక్త కణాలకు మరింత శక్తి వస్తుంది. కాస్త నీరెండలో ఆ వంటిపైన పూసిన మట్టిని ఎండనిస్తే ఈ చికిత్స వల్ల చర్మపు ముడతులు పోతాయి. చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి.