Categories
బలమైన గట్టి ఎముకల కోసం,కండరాలు బలంగా ఉండటం కోసం పిల్లల్లో మెదడు పెరుగుదలకోసం,గుండె శ్వాసకోస వ్యవస్థల పనితీరు మెరుగు పరచటం కోసం శరీరంలో డి విటమిన్ ఉండాలి. రోజంతా ఆఫీస్ ల్లో ఇళ్ళల్లో ఎండలోకి రాకుండా ఉండటంవల్ల,మనం తీసుకొనే పదార్ధాల్లో విటమిన్-డి అంతగా లభించక పోవటం వల్ల మన దేశ జనాభాలో 40 శాతం ప్రజల్లో డి-విటమిన్ లోపం ఉంది. ఈ లోపం లేకుండా ఉండాలి అంటే ప్రతి రోజు తప్పని సరిగా ఒక గ్లాస్ పాలు తాగాలి బిట్ రూట్,క్యారట్ బీన్స్ చిలకడ దుంపలు దోసకాయ వంటివి తినాలి ఏరోబిక్స్,నడక,బాస్కెట్ బాల్,వెయిట్ లిఫ్టింగ్ వంటివి ఎముకలు దృఢంగా ఉంచుతాయి. గింజలు పాల ఉత్పత్తులు తృణ ధాన్యాల తో ఎముకలకు శక్తి లభిస్తుంది. బాదం పప్పులు నువ్వులు ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.